కంటతడి పెట్టిన మెగాస్టార్

X
By - Chitralekha |20 Jun 2023 5:06 PM IST
మనవరాలి రాకతో ఉబ్బితబ్బిబైపోతున్న చిరంజీవి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనకు పాపాయి పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు సైతం చిట్టితల్లి రాకతో ఆనంద సందోహాల్లో మునిగితేలుతున్నారు. ఉదయమే తమ లిట్టిల్ మెగా ప్రిన్సెస్ ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. వారసురాలిని చూసుకుని గుండెల నిండా సంతోషంతో తిరిగి వచ్చిన చిరు.. మీడియాతో పాపాయి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆంజనేయస్వామి వారి దయతో పాపాయి పుట్టిందని మురిసిపోయారు. మంగళవారం నాడు చిన్నారి తమ ఇంటికి రావడం తమ అదృష్టమని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
