Telangana News : నీటి వాటాల జగడం.. కేసీఆర్ కే మైనస్ అయిందా..?

మాజీ సీఎం కేసీఆర్ లేవనెత్తిన నీటి వాటాల ఇష్యూ తిరిగి ఆయనకే మైనస్ అయిందా అనే ప్రచారం జరుగుతుంది. చాలాకాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకుండా పోతున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రభుత్వానికి అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల విషయంలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విషయాల గురించి లోతుగా అధ్యయనం చేయించారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది బయటకు తీసి దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ ట్రిబ్యునల్ ముందు చెప్పిన విషయాలన్నీ బయట పెట్టారు. ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలు అన్నట్టు సంతకం పెట్టడమే మరణ శాసనం అయిందని రేవంత్ రెడ్డి బట్టబయలు చేశారు. కృష్ణా జలాల్లో 34 శాతం నీళ్లు మాత్రమే తెలంగాణకు చాలు అని కేసిఆర్ ఒప్పుకోవడం వల్లనే ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరించారు.
కెసిఆర్ ప్రభుత్వం చేసిన పనులను, నీటి వాటాల విషయంలో ఒప్పుకున్న వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బయట పెట్టింది. కానీ సభలో బీఆర్ఎస్ లేకపోవటం వాళ్లకే మైనస్ అయింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూను రాజేసింది బిఆర్ఎస్ పార్టీనే. అలాంటప్పుడు అంత పెద్ద ఇష్యూ మీద చర్చ జరుగుతుంటే అసెంబ్లీని బైక్ కట్ చేసి వెళ్లిపోవడం వాళ్లకే మైనస్ అయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీలో ఇదే విషయం మీద గట్టిగా పోరాడితే వాళ్లకు ఎంతో కొంత ప్లస్ అయి ఉండేది. కానీ అసెంబ్లీలో మాట్లాడకుండా తెలంగాణ భవన్ లో మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పటం ఏంటో వాళ్లకే అర్థం కావాలి.
ఇష్యూని తీసుకువచ్చి చివరకు దానిమీద చర్చించకుండానే పారిపోయారు అంటూ బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. వాళ్ల తప్పులు బయటపడతాయని భయంతోనే పారిపోయారు అంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్ ఇంత పెద్ద ఆరోపణలు చేసినా కూడా అసెంబ్లీకి వస్తే తాప చర్చిద్దాం అనుకున్నామని కానీ అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో ఒకరకంగా కాంగ్రెస్ కు ప్లస్ అయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags
- KCR water dispute
- Krishna river water shares
- Palamuru Rangareddy project
- Revanth Reddy allegations
- BRS vs Congress
- Telangana Assembly debate
- Krishna tribunal
- 299 TMC issue
- Uthtam Kumar Reddy presentation
- BRS walkout
- political backlash
- Telangana water politics
- Telangana News
- Telangana Political News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
