BABU ARREST: బాబు విడుదల కావలంటూ గణపతి మాలధారణ

BABU ARREST: బాబు విడుదల కావలంటూ గణపతి మాలధారణ
X
చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ మాలధారణ... అనకాపల్లిలో శ్రేణుల ప్రత్యేక పూజలు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ నేతలు గణపతి మాలధారణ చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో తొలిసారిగా 50 మంది తెలుగుదేశం పార్టీ నేతలు గణపతి మాలాధారణ చేపట్టి లక్ష్మీ గణపతి ఆలయంలోప్రత్యేక పూజలు చేశారు.


చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నినదించారు. 2024 లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాలని గణనాథుడ్ని ప్రార్థించారు.

Tags

Next Story