Eeluru: జనవాణి కార్యక్రమంలో పవన్ భరోసా

X
By - Chitralekha |10 July 2023 5:39 PM IST
పవన్‌కళ్యాణ్‌ను కలిసిన ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
సేవా కార్యక్రమాలలో ముందున్న ఏలూరు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏలూరు అశోక్ నగర్ శ్మశాన వాటికలో తమ సంస్థ నిర్మాణాలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని వివరించారు. 19 ఏళ్లుగా అంతిమ సంస్కారాల సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అంతిమ సంస్కారాలకు అవసరమయిన సామాగ్రిని పెట్టేందుకు స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ.. సమస్య పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
