Mahaboobnagar: ప్లాస్టిక్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Mahaboobnagar: ప్లాస్టిక్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
X

మహబూబ్‌నగర్‌జిల్లాలోని ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలోని బాలనగర్‌లో ఉన్న శ్రీనాథ్‌ రోటా ప్యాక్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఫర్నేస్‌ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags

Next Story