TTD: సప్తగిరుల్లో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

X
By - Sathwik |20 Sept 2023 11:30 AM IST
సింహ వాహనంపై మలయప్ప స్వామి అభయం... కిక్కిరిసిన మాడవీధులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి తిరు వీధుల్లో విహరించారు.
అధికసంఖ్యలో తరలి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరగనుంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
