Anakapalli: విస్సన్నపేట లేఅవుట్‌లో బయటపడుతున్న పెద్దల పాత్ర

Anakapalli: విస్సన్నపేట లేఅవుట్‌లో బయటపడుతున్న పెద్దల పాత్ర
X

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట లేఅవుట్‌లో వైసీపీ పెద్దల పాత్ర ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్సన్నపేట భూముల్లో 60 ఎకరాలను మంత్రి అమర్నాథ్‌, విజయసాయిరెడ్డికి గురుదక్షిణ కింద ఇచ్చినట్లు ఆరోపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి బినామి గోపీనాథ్‌రెడ్డి సంస్థ ఎశుర్ డెవలపర్స్ పేరుపై భూబదిలీ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అమర్నాథ్‌ బినామి బొడ్డేటి ప్రసాద్, ఆయన తండ్రితో పాటు మరికొంతమంది బినామిల పేర్లపై విస్సన్నపేట భూములు మారిపోయాయి. మరోవైపు రైతులను వారి భూముల వద్దకు వెళ్లకుండా మంత్రి అనుచరులు అడ్డుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూదోపిడీ చేస్తున్నారని వామపక్షాలు, జనసైనికులు ఆరోపిస్తున్నారు.

Tags

Next Story