Gas Cylinder Explosion: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. కుప్పకూలిన ఇళ్లు , 11 మందిని రక్షించిన అధికారులు

Gas Cylinder Explosion: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. కుప్పకూలిన ఇళ్లు , 11 మందిని రక్షించిన అధికారులు
X

మహారాష్ట్ర ముంబై లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెంబూర్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌ ప్రాంతానికి సమీపంలో గల ఓల్డ్‌ బ్యారక్‌ వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండ్‌ పేలడంతో పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లు కూలిపోయినట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను 50 ఏళ్ల వికాస్‌ ఆంబోర్‌, 27 ఏళ్ల అశోక్‌ ఆంబోర్‌, 47 ఏళ్ల సవితా ఆంబోర్‌, 29 ఏళ్ల రోహిత్‌ ఆంబోర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story