తమిళ బిడ్డ.... తెలంగాణా అక్క

X
By - Chitralekha |17 May 2023 5:20 PM IST
గిరిజనులతో గవర్నర్ తమిళసై ఆటా పాటా
ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయితీల సమస్యలు విన్నానన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ ఐదు గ్రామాల ప్రజల కష్టాలు చాలా బాధ కలిగించాయన్నారు. 5 గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని గిరిజనులు కోరారని.. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. తాను తమిళ బిడ్డనైనా... తెలంగాణ ప్రజలకు అక్కనన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని, ఆదివాసీల సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. గిరిజనులతో గవర్నర్ తమిళిసై పదం కలిపారు. వారి సాంప్రదాయ నృత్యంలో అడుగులు కలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
