శృంగవరపు కోటలో బాబు పర్యటన

X
By - Chitralekha |17 May 2023 4:47 PM IST
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పర్యటన
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పర్యటించనున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి ఆధ్వవర్యంలో.. ఈ కార్యక్రమం జరుగనుంది. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి కొత్త వలస రానున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం.. పుణ్యగిరి, వివేకానంద కళాశాల మీదుగా.. ఎస్ కోట దేవిగుడి కూడలి వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
