దీదీకి లీగల్ నోటీసులు పంపిన డైరెక్టర్

X
By - Chitralekha |9 May 2023 4:06 PM IST
ది కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల మమత చేసిన ప్రకటనలలో.. 'ది కాశ్మీర్ ఫైల్స్' , 'ది కేరళ స్టోరీ' సినిమాలను సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీశారని ఆరోపించారు. ఇందుకుగాను వివేక్ ఆమెకు నోటీసులు పంపినట్లు తెలిపారు. “నేను @AbhishekOfficl, పల్లవి జోషి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు లీగల్ నోటీసు పంపాము, మా మర్యాదకు భంగం కలిగించే విధంగా ఆమె తప్పుడు ఆరోపణలు చేశారు. అవి మా ప్రతిష్ఠకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి." అని వివేక్ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
