Samyuktha Menon: టాలీవుడ్‌లోకి మరో మలయాళ కుట్టి.. 'భీమ్లా నాయక్' హీరోయిన్ క్యూట్ ఫోటోస్..

Samyuktha Menon (tv5news.in)
Samyuktha Menon: మలయాళ కుట్టీలు ఇప్పటికే చాలామంది టాలీవుడ్‌లోకి వచ్చి ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ కుట్టి తెలుగువారి మనసులు దోచుకోవడానికి వచ్చేస్తోంది. తనే సంయుక్త మీనన్.
మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యపనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ 'భీమ్లా నాయక్'తో సంయుక్త మీనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌లో ఇప్పటికే ఓ మలయాళ అమ్మాయి నిత్యా మీనన్.. పవన్‌కు జోడీగా నటిస్తోంది. మరో మలయాళ కుట్టి సంయుక్త మీనన్.. రానా భార్యగా కనిపించనుంది.
సంయుక్త పలు మలయాళ, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
పలు మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించింది సంయుక్త మీనన్.
భీమ్లా నాయక్‌తో తెలుగులోకి 'గాలిపటా 2' అనే కన్నడ చిత్రంతో శాండిల్‌వుడ్‌లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తోంది సంయుక్త మీనన్.
ఇటీవల భీమ్లా నాయక్ నుండి విడుదలయిన అడవి తల్లి మాట పాటలో కాసేపే కనిపించినా.. సంయుక్త మీనన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
