Richa Gangopadhyay: స్టార్ హీరోలతో నటించి కనుమరుగయిపోయిన హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Richa Gangopadhyay (tv5news.in)
Richa Gangopadhyay: కొందరు నటీనటులు ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా.. ప్రేక్షకులకు మాత్రం వారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అందులో రిచా గంగోపాధ్యాయ. ఈరోజు ఈ అమ్మడి పుట్టినరోజు.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతోనే దగ్గుబాటి రామానాయుడు మనవడు రానాతో సినిమా ఛాన్స్ కొట్టేసింది రిచా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లీడర్'లో తన నటనతో అందరినీ ఫిదా చేసింది.
టాలీవుడ్‌లో బొద్దుగా ఉండే హీరోయిన్లు చాలా తక్కువ. అందుకే రిచా తన చబ్బీ లుక్స్‌తో అందరినీ ఫిదా చేసింది.
రిచా గంగోపాధ్యాయ కేవలం నాలుగేళ్లే ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మెరిసింది. ఆ తర్వాత పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌పై దృష్టిపెట్టింది.
నాలుగేళ్లలోనే నాగార్జున, వెంకటేశ్‌లాంటి స్టార్ హీరోలతో జోడీకట్టింది రిచా.
ప్రభాస్‌లాంటి స్టార్‌తో కలిసి 'మిర్చి'లో కూడా చేసింది.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా శింబు, ధనుష్‌లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసింది రిచా.
నాగార్జునతో నటించిన 'భాయ్'.. రిచా ఆఖరి చిత్రం.
ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఎమ్‌బీఏలో జాయిన్ అయ్యింది.
యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న జో ల్యాంగెళ్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
రిచా, జోలకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
ప్రస్తుతం వీరు అమెరికాలోనే పర్మనెంట్‌గా సెటిల్ అయిపోయారు.
కొన్నాళ్లకే తన మీద ఇష్టం పెంచుకున్న అభిమానులు.. మళ్లీ రిచా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
