Nithya Menen: పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?

Nithya Menen: 'అలా మొదలైంది' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిత్యామీనన్. ఇటీవల ఈ హీరోయిన్ పెళ్లిపై అనేక ఊహాగానాలు వినిపిస్తుండగా.. వాటిపై తాజాగా స్పందించింది నిత్యా.
ఇప్పటివరకు నిత్యామీనన్ పర్సనల్ లైఫ్‌పై పెద్దగా రూమర్స్ ఏమీ రాలేదు.
కథ నచ్చకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూసే మనస్తత్వం నిత్యాది.
తన పాత్రకు ప్రాధాన్యత ఉంది అంటేనే నిత్యామీనన్ సినిమా ఒప్పుకుంటుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళంలో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించిన నిత్యా.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది.
విజయ్ సేతుపతితో '19(1)(a)' అనే చిత్రంలో నటిస్తోంది నిత్యా. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా.. తన పెళ్లి వార్తలపై స్పందించింది.
'నిన్నటి నుంచి నా పెళ్లి గురించి తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు' అని పెళ్లి వార్తలను కొట్టిపారేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
