Nivedhithaa Sathish: 'ఆన్యాస్ ట్యుటోరియల్'తో ఆకట్టుకున్న నివేదితా సతీష్ బ్యాక్‌గ్రౌండ్..

Nivedhithaa Sathish: ఆన్యాస్ ట్యుటోరియల్తో ఆకట్టుకున్న నివేదితా సతీష్ బ్యాక్‌గ్రౌండ్..
X
Nivedhithaa Sathish: మాతృభాష తెలుగు అయినా.. నివేదితా మాత్రం ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది.

Nivedhithaa Sathish: ఇప్పటికే ఎంతోమంది తెలుగమ్మాయిలు.. తెలుగు పరిశ్రమలో అవకాశం లేక పక్క భాషల ఇండస్ట్రీలకు వెళ్లిపోయారు. అందులో ఒకరు నివేదితా సతీష్.


సొంత ప్రాంతం గుంటూరు అయినా, మాతృభాష తెలుగు అయినా.. నివేదితా మాత్రం ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది.


2017లో విడుదలయిన 'మగలిర్ మట్టుమ్' అనే తమిళ చిత్రంతో నివేదితా.. గ్లామర్ ప్రపంచానికి పరిచయమయ్యింది.


ఆ సినిమాలో తనను చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ కె కుమార్.. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'హలో' చిత్రంలో నివేదితాకు కూడా ఓ రోల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది నివేదితా.


ఆ తర్వాత కూడా పలు తమిళ చిత్రాల్లో నటించింది. ఇటీవల 'ఆన్యాస్ ట్యుటోరియల్' అనే ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది.


హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఆన్యాస్ ట్యుటోరియల్.. ట్రైలర్ విడుదలయిన దగ్గర నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఆ సిరీస్ ట్రైలర్‌లోనే తాను చేసిన నటనతో దర్శక ధీరుడు రాజమౌళిని ఇంప్రెస్ చేసింది నివేదితా.


ఆహాలో విడుదలయిన ఆన్యాస్ ట్యుటోరియల్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన సుడల్‌లో కూడా నివేదితా గుర్తుండిపోయే పాత్రలు చేసింది.


ఇక ఆన్యాస్ ట్యుటోరియల్‌లో నివేదితా నటన చూసిన ప్రేక్షకులు తనను మరికొన్ని సినిమాల్లో, సిరీస్‌లలో చూడాలని కోరుకుంటున్నారు.



Tags

Next Story