Aishwarya Lekshmi: 'గార్గి'లో హీరోయిన్ ఒకరు కాదు ఇద్దరు.. తనే ఐశ్వర్య లక్ష్మి..

Aishwarya Lekshmi: గార్గిలో హీరోయిన్ ఒకరు కాదు ఇద్దరు.. తనే ఐశ్వర్య లక్ష్మి..
X
Aishwarya Lekshmi: 2017లో మాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయిన ఐశ్వర్య.. ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించింది.

Aishwarya Lekshmi: సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన 'గార్గి' సినిమా శుక్రవారం విడుదలయ్యి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో కనిపించిన హీరోయిన్ సాయి పల్లవి అయితే.. కనిపించని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.


ఐశ్వర్య లక్ష్మి.. గార్గి సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. ఇప్పటివరకు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యకు నిర్మాతగా ఇదే మొదటి చిత్రం. ఈ విషయాన్ని తాను గార్గి ఈవెంట్‌లో చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యింది.


2017లో మాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయిన ఐశ్వర్య.. ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించింది.


గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సాధించింది ఐశ్వర్య లక్ష్మి.


ఇటీవల సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 'గాడ్సే'తో తెలుగులో కూడా అడుగుపెట్టింది ఈ మలయాళ ముద్దుగుమ్మ.


గార్గి అనేది ఓ పవర్‌ఫుల్ అమ్మాయి కథ కాబట్టి ఆ సినిమా మొత్తాన్ని తన భుజంపై మోసే నటి కావాలని ఓ నిర్మాతగా తానే సాయి పల్లవిని సెలక్ట్ చేసింది ఐశ్వర్య లక్ష్మి.


గార్గి సక్సెస్‌తో అటు హీరోయిన్‌గా, ఇటు నిర్మాతగా కూడా ఐశ్వర్యకు ఫుల్ మార్కులు పడ్డాయి.


గార్గికి నిర్మాతగానే కాకుండా ఓ కీలక పాత్రలో కూడా కనిపించి మెప్పించింది ఐశ్వర్య.


ప్రస్తుతం ఐశ్వర్య.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'పొన్నియిన్ సెల్వన్'లో ఓ చిన్న రోల్ కూడా చేస్తోంది. అంతే కాకుండా తన చేతిలో మూడు మలయాళ చిత్రాలు కూడా ఉన్నాయి.





Tags

Next Story