Sharwanand : ఒకే పాయింట్ తో రెండు సినిమాలు.. మరి రిజల్ట్..?

Sharwanand :  ఒకే పాయింట్ తో రెండు సినిమాలు.. మరి రిజల్ట్..?
X

ఒకే పాయింట్ తో రెండు సినిమాలు అదీ ఒకేసారి వస్తుండటం మాత్రం అత్యంత అరుదైన విషయం. పైగా ఆ రెండు సినిమాలూ ఎంటర్టైన్మెంట్ తోనే నిండిపోయి ఉండటం మాత్రం మరో విషయం. యస్ ఆ రెండు సినిమాలు మాత్రం భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుము మురారి. ఈ రెండు సినిమాల పాయింట్ మాత్రం దాదాపుగా ఒకటేగా ఉంది. భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి అంటే హీరో పెళ్లి చేసుకుని ఉంటాడు. అతనికి మరో కొత్తగా ప్రియురాలు ఉండటం, తర్వాత ఇద్దరూ కలవడం.. ఆ ఇద్దరి మధ్య నలిగిపోయిన భర్తలా కనిపించడం మాత్రం మెయిన్ పాయింట్. రవితేజ, డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ ఈ చిత్రంలో నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం చేయడం.. కొత్తగా ఉంది. అతను ఇంతకు ముందు డిఫరెంట్ పాయింట్స్ తోనే సినిమాలు రూపొందించాడు. ఈ సారి ఈ పాయింట్ తోవస్తుండటం మాత్రం ఎంత మేరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.

ఇక నారీ నారీ నడుము మురారి విషయంలోనూ ఇంచుమించు ఇలాగే కనిపిస్తోంది. కాకపోతే ఇందులో శర్వానంద్ కు భార్య ఉండదు. మొదట ఓ లవర్ ఉంటుంది. తర్వాత మరో లవర్ ఉంటుంది. ఇద్దరి మధ్య అతను నలిగిపోయే విధానం వినోదాత్మకంగా ఉండబోతోంది అనిపించేలా ట్రైలర్ తో తెలుస్తోంది. దీంతో పాటు చాలా లేయర్స్ కూడా యాడ్ చేసినట్టు కనిపిస్తున్నారు. అది కామెడీగా యాడ్ అవుతుంది అంటున్నారు.

బట్ మెయిన్ పాయింట్ మాత్రం ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయేలా ఉన్నారు. అదీ ఒకేసారి విడుదల అవుతుండటం, దాన్ని ఆడియన్స్ ఏ మేరకు పాజిటివ్ గా తీసుకుంటారు అనేది ముఖ్యం. అదే టైమ్ లో కామన్ పాయింట్ అయినా ట్రీట్మెంట్ మాత్రం పూర్తిగా వేరు ఉండటం మాత్రం చాలా ఎసెట్ అవుతుంది. అది అవుతుంది లేదా అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఒకే తరహాలో రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కాబోతుండటం మాత్రం అత్యంత అరుదైన ఘటన ఇది.

Tags

Next Story