చాగంటిపై అన్వేష్‌ చావు కామెంట్లు.. ఏంటీ దారుణం..?

చాగంటిపై అన్వేష్‌ చావు కామెంట్లు.. ఏంటీ దారుణం..?
X

నా అన్వేషణ అన్వేష్ నిజంగా రోజురోజుకూ దిగజారిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు వెనకాముందు ఆలోచించకుండా హిందూ పురాణాలను, హిందూ యువకులను ఇప్పటికే ఘోరంగా అవమానించాడు. సీతాదేవి, ద్రౌపదిని ఇప్పటికే దారుణంగా అవమానించాడు. హిందూ సమాజం మొత్తం అతన్ని ఛీ కొట్టడంతో పాటు లక్షల మంది సబ్ స్క్రైబర్లు తగ్గిపోతున్నారు అతనికి. దీంతో అతను కాస్త తగ్గి క్షమాపణలు చెప్పినట్టే చెప్పి మళ్లీ రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు మరో దారుణమైన వీడియో వదిలాడు. ఇందులో చాగంటి కోటేశ్వర్ రావు, గరికపాటి నర్సింహారావు చనిపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టాడు. ఇది చూస్తే ఎవరికైనా దారుణంగా అనిపించాల్సిందే. వాళ్లను పట్టుకుని మీరు చనిపోతారు.. పైకి వచ్చాక మనం మాట్లాడుకుందాం. ఎంతకాలం బతుకుతారు మీరు అంటూ అత్యంత దిగజారిపోయి కామెంట్లు చేస్తున్నాడు అన్వేష్. అతని మాటలు వింటే ఎవరికైనా చిరాకుగానే అనిపిస్తుంది. ఒకరకంగా అతనికి పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారు అందరూ కూడా.

కానీ అన్వేష్‌ మాత్రం అలా కాదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నాడు. ఇంకా అస్సలు తగ్గేదే లే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంత చేసినా సరే అన్వేష్ కు అసలు బుద్ధి రావట్లేదు కాబోలు. తాను ఇండియాకు రానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్టు రెచ్చిపోతున్నాడు. నిజంగా అతని ప్రవర్తన ఎలా ఉందంటే.. డబ్బుతో కాస్త పొగరు ఎక్కువ అయినట్టే కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్ లపై పోరాడినప్పుడు అన్వేష్ కు ఎంతో కొంత మంచి పేరు ఉండేది. ఇప్పుడు మొత్తం పోయి పూర్తిగా వివాదంలో చిక్కుకున్నాడు. కాబట్టి అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

అన్వేష్ కు నిజంగానే అహంకారం ఎక్కువ అయిపోయిందని.. ఇలాంటి వ్యక్తిని అస్సలు విడిచిపెట్టొద్దని అంటున్నారు. త్వరలోనే ఇండియాకు అతన్ని రప్పించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేగానీ బుద్ధి రాదని అంటున్నారు చాలా మంది హిందూ సంఘాల నేతలు. మన పురాణాలను, దేవుళ్లను అవమానించేవారు ఎవరైనా సరే ఊరుకోవద్దని చెబుతున్నారు.


Tags

Next Story