జిల్లాల పునర్విభజనపై వైసీపీ అసత్యాలు..

కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే దాని మీద బురద చల్లడం మాత్రమే పనిగా పెట్టుకుంది వైసిపి పార్టీ. మొన్నటిదాకా పిపిపి మీద రకరకాల ప్రచారాలు చేసిన వైసిపి.. ఇప్పుడు జిల్లాల పునర్విభజన మీద పడ్డారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మీద తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. గూడూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ గా ఉండట్లేదని.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న గూడూరుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని తప్పుడు ప్రచారానికి తెరతీసింది వైసిపి బ్యాచ్. వాస్తవానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేసే చాలా ప్రాంతాలకు అన్యాయం చేశాడు. ఇప్పటికీ ఆయా జిల్లాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇదే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. అయినా సరే జగన్ వారిని పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించాడు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గూడూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. కూటమి ప్రభుత్వం రాగానే గూడూరు రెవెన్యూ డివిజన్ ను తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అప్పటి హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కలిపారు. తిరుపతి అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నందున తీరప్రాంతం ఉండాలనే ఉద్దేశంతో రెండు మండలాలను తిరుపతిలోనే ఉంచారు.
మరో మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించారు. మూడు మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్ ను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగించారు. ఇలా చేయడం వల్ల అన్ని ప్రాంతాలకు లాభం జరుగుతుందని కూటమి చెబుతోంది. కానీ వైసీపీ మాత్రం గూడూరు రెవెన్యూ డివిజన్ పోయింది అంటూ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న గూడూరు నియోజకవర్గంలో ఒకప్పుడు 16 మండలాలు ఉండేవని.. ఇప్పుడు కేవలం 3 మండలాలకే పరిమితం చేశారు అంటూ గూడూరు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇక్కడ గూడూరు రెవెన్యూ డివిజన్ ఎక్కడికి పోలేదని.. కోనసీమ జిల్లాల్లో ఇప్పటికి చాలా రెవెన్యూ డివిజన్లు రెండు మండలాలతోనే ఉన్నాయి అనే విషయాలను కూటమి గుర్తు చేస్తోంది. కాబట్టి గూడూరు ప్రతిష్టను తాము తగ్గించలేదని అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు నెల్లూరు జిల్లాలోనే కలిపినట్టు చెబుతోంది.
Tags
- YSRCP propaganda
- district reorganisation Andhra Pradesh
- Gudur constituency
- Nellore district
- Gudur revenue division
- Chandrababu Naidu promise
- Lokesh Gudur visit
- NDA government decisions
- YS Jagan districts
- Tirupati development
- false campaign allegations
- Andhra Pradesh politics
- Andhra Pradesh News
- TV5 News
- Latest Telugu News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
