CBN: "ఏపీ విమానాశ్రయరంగంలో ఓ మైలురాయి"

CBN: ఏపీ విమానాశ్రయరంగంలో ఓ మైలురాయి
X
ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న చంద్రబాబు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వాలిడేషన్ విమానం ఉదయం 11 గంటల సమయంలో రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ కావడంతో, ఈ ప్రాజెక్టు మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్‌తో ఘనస్వాగతం పలికారు. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ **కలిశెట్టి అప్పలనాయుడు**తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రయాణించారు. వారు విమానాశ్రయ ప్రాంగణాన్ని పరిశీలించి, అధికారులతో పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిడేషన్ విమానం ల్యాండ్ కావడం ఏపీ విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి అని ఆయన అభివర్ణించారు. 2014–19 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఇది సాకారమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ఎయిర్‌పోర్ట్ అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు. అది ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది” అని అన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీ అభివృద్ధిలో భోగాపురం మైలురాయి: జగన్

వి­శా­ఖ­ప­ట్నం­లో కొ­త్త­గా ని­ర్మిం­చిన భో­గా­పు­రం ఇం­ట­ర్నే­ష­న­ల్‌ ఎయి­ర్‌­పో­ర్టు­లో తొలి వి­మా­నం ల్యాం­డిం­గ్ కా­వ­‌­డం­పై వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ అధి­నేత వై­ఎ­స్‌ జగ­న్‌ హర్షం వ్య­క్తం చే­శా­రు. వి­మా­నా­శ్ర­యం ఏర్పా­టు కోసం వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ హయాం­లో­నే అను­మ­తు­లు సా­ధిం­చ­డం, ప్ర­ధాన పను­ల్లో గణ­నీ­య­మైన భాగం అప్పు­డే పూ­ర్త­‌­యిం­ద­ని చె­ప్పు­కొ­చ్చా­రు. వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ అధి­నేత వై­ఎ­స్‌ జగ­న్‌ ట్వి­ట్ట­ర్‌ వే­ది­క­గా..‘వి­శా­ఖ­ప­ట్నం­లో కొ­త్త­గా ని­ర్మిం­చిన భో­గా­పు­రం ఇం­ట­ర్నే­ష­న­ల్‌ ఎయి­ర్‌­పో­ర్టు­లో తొ­లి­వి­మా­నం ల్యాం­డిం­గ్ కా­వ­‌­డం ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అభి­వృ­ద్ధి మా­ర్గం­లో ఒక­మై­లు­రా­యి. #VisionVizag లక్ష్యా­న్ని సా­ధిం­చే ది­శ­గా కీలక అడు­గు పడిం­ది. ఈ ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మా­ణం­లో అసా­ధా­రణ కృషి చే­సిన GMR గ్రూ­ప్‌­కు నా హృ­ద­య­పూ­ర్వక అభి­నం­ద­న­లు. మా పా­ల­నా కా­లం­లో వే­గ­వం­త­మైన అను­మ­తు­లు సా­ధిం­చ­డ­మే కాదు, ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మా­ణం కోసం భూ­ము­లు ఇచ్చిన వారి పు­న­రా­వా­సం కోసం, భూ­సే­క­రణ కోసం సు­మా­రు రూ. 960 కో­ట్లు ఖర్చు చే­య­డం ద్వా­రా ఈ ప్రా­జె­క్టు­కు బల­మైన పు­నా­ది వే­శామని జగన్ అన్నారు.

Tags

Next Story