AMBATI: అంబటిపై మూడు కేసులు.. ఇంటికి నిప్పు

AMBATI: అంబటిపై మూడు కేసులు.. ఇంటికి నిప్పు
X
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టీడీపీ నేతలు... ఇంకా వెనకేసుకు వస్తున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసుల అరెస్ట్, అనంతరం జరిగిన ఆందోళనలు, దాడులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తరువాత పరిస్థితులు అదుపు తప్పడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. గుంటూరు నగరంలో అర్ధరాత్రి సమయంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. భారీ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అంబటి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలో అంబటిపై దాడికి యత్నించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, అంబటి అరెస్ట్ అనంతరం రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

కట్టలు తెంచుకున్న ధర్మాగ్రహం

మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తరువాత టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గుంటూరులోని ఆయన నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు అక్కడ ఉన్న కార్లను ధ్వంసం చేయడంతో పాటు తగలబెట్టారు. , అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు మరో భారీ షాక్ తగిలింది. ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు నమోదు కాగా, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గుంటూరులో జరిగిన ఘటనపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. , రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో పోలీసుల సూచనలను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, పల్నాడు జిల్లాలో కూడా అంబటి చేసిన వ్యాఖ్యలపై ఒక టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో మూడో కేసు నమోదైంది.

అంబటి నివాసం వద్ద అర్ధరాత్రి అయినప్పటికీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానికంగా పరిస్థితిని గమనిస్తున్న ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.

Tags

Next Story